- ఎంపీ రఘువీర్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో 50 బెడ్స్‌తో కూడిన 3 ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హాస్పిటల్స్ ఏర్పాటుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభలో ఎంపీ కందూరు రఘువీర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి ప్రతాప్ రావు గణపతిరావు జాదవ్ సమాధానం ఇచ్చారు. అయితే, కొత్తగా ఆయుష్ మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ నుంచి ప్రతిపాదన అందలేదన్నారు.
