జడ్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్రం రూ.47 కోట్లు: ఎంపీ డీకే అరుణ

జడ్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్రం రూ.47 కోట్లు: ఎంపీ డీకే అరుణ

జడ్చర్ల టౌన్​, వెలుగు : కేంద్ర ప్రభుత్వం జడ్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.47 కోట్ల నిధులు మంజూరు చేసిందని మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. శనివారం జడ్చర్లలోని పోచమ్మ గుడి ఊర చెరువు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డితో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. 

]అమృత్ 2.0 స్కీం కింద ఈ చెరువు అభివృద్ధికి రూ.1.11 కోట్లు కేటాయించినట్లు ఆమె పేర్కొన్నారు. పట్టణాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందన్నారు. కాగా, అమృత్ పనులు నత్తనడకన సాగడంపై అసహనం వ్యక్తం చేశారు.