రైతులకు గుడ్ న్యూస్: వరి మద్దతు ధర రూ. 117 పెంపు

రైతులకు గుడ్ న్యూస్: వరి మద్దతు ధర రూ. 117 పెంపు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు  తీసుకుంది. వరి, రాగి, బజ్రా, జొన్న, మొక్కజొన్న ,  పత్తితో సహా 14 ఖరీఫ్ సీజన్ పంటలపై కనీస మద్దతు ధరకు (MSP) కేబినెట్ ఆమోదం తెలిపింది.  వరికి క్వింటాలకు కనీస మద్దతు ధర రూ.117 పెంచుతున్నట్లు కేంద్ర ప్రకటించింది.  దీంతో క్వింటా వరి ధర రూ. 2300కు చేరుతోంది.  పెంచిన ధరలను ఖరీఫ్ నుంచి అమలు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్  చెప్పారు. పెరిగిన ధరలతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. 

కొత్త ధరలు 

వరి కనీస మద్దతు క్వింటా ధర రూ. 2300
కంది పప్పు కనీస మద్దతు ధర  రూ. 7550
మినుములు రూ.7400
పెసర  ధర రూ. 8682 
వేరు శనగ ధర రూ.6783
పత్తి కనీస మద్దతు ధర రూ. 7121 
జొన్న కనీస మద్దతు ధర రూ.3371

కేబినెట్  కీలక నిర్ణయాలు

  • రూ. 2,870 కోట్లతో వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణణకు కేబినెట్ ఆమోదం
  • సముద్రం నుంచి కరెంట్ ఉత్పత్తి చేసేలా తమిళనాడు,గుజరాత్ లో పవర్ ప్లాంట్లకు ఆమోదం
  • ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆమోదం
  • మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా దహనులో, రూ.76,200 కోట్లతో  ఆల్-వెదర్ గ్రీన్‌ఫీల్డ్ డీప్-డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్‌ అభివృద్ధి