
గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్‌ను కేంద్రప్రభుత్వం రిలీజ్ చేసింది. విలేజ్ లెవెల్లో నిఘా పెట్టాలని సూచించింది. టెస్టులు చేసి పాజిటివ్ వచ్చినవారిని ఐసోలేట్ చేయాలని తెలిపింది. వారికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లతో టెలీ కన్సల్టేషన్ నిర్వహించాలని సూచించింది. శాచురేషన్ తక్కువగా ఉన్నవారిని, కోమోర్బిడిటీస్ ఉన్నవారిని పెద్ద హాస్పిటల్స్‌కు తరలించాలని తెలిపింది. లక్షణాలున్నవారికి వెంటనే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయాలని కేంద్రం తెలిపింది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ANMలకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయడంలో ట్రెయినింగ్ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు, PHCలలో యాంటీజెన్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచాలని కేంద్రం ఆర్డర్స్ జారీ చేసింది. పాజిటివ్ వచ్చిన వారికి హోం ఐసోలేషన్ కిట్ అందచేయాలని సూచించింది. ఆ కిట్‌లో పారాసిటమాల్, ఐవర్‌మెక్టిన్, కఫ్ సిరప్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు ఉండాలని ఆదేశించింది.