కొత్తగా 500 స్టోర్లు ఏర్పాటు చేస్తాం : సెంచరీ మ్యాటెసెస్

కొత్తగా 500 స్టోర్లు ఏర్పాటు చేస్తాం : సెంచరీ మ్యాటెసెస్
  • బ్రాండ్​ అంబాసిడర్​గా పీవీ సింధు
  • ప్రకటించిన సెంచరీ మ్యాట్రెసెస్​

హైదరాబాద్​, వెలుగు: రాబోయే మరికొన్ని నెలల్లో దేశమంతటా 500 ఎక్స్​క్లూజివ్​ స్టోర్లను ఏర్పాటు చేస్తామని సెంచరీ మ్యాట్రెసెస్​ ప్రకటించింది. వీటిలో కొన్ని తెలంగాణలోనూ ఉంటాయని తెలిపింది. బ్రాండ్​ ఎంబాసిడర్​గా బ్యాడ్మింటన్​​​స్టార్​ పీవీ సింధును నియమించుకున్న సందర్భంగా హైదరాబాద్​లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంపెనీ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ ఉత్తమ్​ మలానీ మాట్లాడారు.  ప్రస్తుతం తమకు దేశవ్యాప్తంగా 500 స్టోర్లు, 18 రాష్ట్రాల్లో 4500 మందికిపైగా డీలర్లు ఉన్నారని తెలిపారు. 

హైదరాబాద్  భువనేశ్వర్‌‌లలో ఫ్యాక్టరీలు, పూణె, బెంగళూరు, వరంగల్, వైజాగ్, విజయవాడ, కర్నూలు, సంబల్‌‌పూర్‌‌లలో సేల్స్ డిపోలు ఉన్నాయని వివరించారు. ‘‘ఇండియాలో పరుపుల మార్కెట్​ సైజు రూ.10 వేల కోట్ల వరకు ఉంటుంది. అనార్గనైజ్డ్​సెక్టార్​ వాటా 40 శాతం ఉంటుంది. ప్రస్తుతం మాకు 10 శాతం మార్కెట్​ షేర్​ ఉంది. దీనిని 20 శాతానికి పెంచాలన్నది లక్ష్యం. ఏటా ఎనిమిది లక్షల పరుపులు తయారు చేస్తున్నాం. 16 మెట్రిక్​ టన్నుల ఫోమ్​ తయారు చేస్తున్నాం. మా రెవెన్యూలో ఎగుమతుల వాటా 10 శాతం ఉంది. ప్లాంట్ల కెపాసిటీని ఏటా 20 శాతం పెంచుతున్నాం. ఏటా 30 శాతం గ్రోత్​ సాధిస్తున్నాం. ఈ ఏడాది 35 శాతం గ్రోత్​ను టార్గెట్​గా పెట్టుకున్నాం”అని మలానీ వివరించారు.