హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉద్యోగులకు స్వేచ్ఛ, వెసులుబాటు, విశ్వాసం కల్పించే వాతావరణాన్ని యాజమాన్యాలు కల్పించాలని స్టూడెంట్ట్రైబ్వ్యవస్థాపకుడు, సీఈవో చరణ్ లక్కరాజు అన్నారు. పనిచేసే ప్రదేశంలో మంచివాతారణం సృష్టిస్తే నిజమైన పనితీరు వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు.
‘జెన్ జీ, పని ప్రదేశంలో ఉత్పాదకత’ అంశంపై ఆదివారం హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లెక్చర్ సెషన్ నిర్వహించారు. ఆయన గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. జెన్ జీ స్వాతంత్య్రంతో కూడిన పనితీరుకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. హెచ్ఎంఏ అధ్యక్షుడు అల్వాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. యువతకు సాధికారత కల్పించేందుకు హెచ్ఎంఏ కట్టుబడి ఉందని చెప్పారు.
