రైతుబంధు పంపిణీపై సర్కారు నుంచి ఎలాంటి ప్రపోజల్​రాలేదు: వికాస్రాజ్

రైతుబంధు పంపిణీపై సర్కారు నుంచి ఎలాంటి ప్రపోజల్​రాలేదు: వికాస్రాజ్
  • వస్తే.. ఈసీకి పంపి నిర్ణయం తీసుకుంటం: సీఈవో వికాస్​రాజ్
  • ఎంపీపై దాడికి సంబంధించి రిపోర్టు​ తీసుకున్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రైతుబంధు పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రపోజల్​రాలేదని సీఈవో వికాస్​రాజ్ తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏదైనా అనుమతి కోరుతూ వస్తే.. ఈసీకి పంపి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.  దుబ్బాక బీఆర్ఎస్​అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనలో పోలీసుల రిపోర్ట్​తీసుకున్నామని, పరిశీలించిన తర్వాత అభ్యర్థుల భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు వికాస్‌‌‌‌రాజ్‌‌‌‌ ప్రకటించారు.

 ప్రగతి భవన్​లో పొలిటికల్​కార్యకలాపాల విషయంలోనూ ఈసీకి రిపోర్ట్​ పంపినట్లు చెప్పారు. బీఆర్కే భవన్​లో శుక్రవారం సీఈఓ వికాస్​రాజ్​మీడియాతో మాట్లాడారు.  మోడల్​కోడ్​ఆఫ్ కండక్ట్​అమలు విషయంలో ప్రతి ఫిర్యాదును స్వీకరించి.. వివరణ తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 256 ఎఫ్ఆర్​ఐలు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో 137 పొలిటికల్ పార్టీలకు సంబంధించినవి ఉన్నాయని, బీఆర్ఎస్​పై 30, కాంగ్రెస్​పై16, మిగిలినవి ఇతర పార్టీలపై ఉన్నట్లు వివరించారు. శుక్రవారం నామినేషన్లు మొదలు అయ్యాయని.. ఈ నెల10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 

నామినేషన్ వేసే అభ్యర్థులు ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో నుంచే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయొచ్చని తెలిపారు. అఫిడవిట్‌‌‌‌లో అన్ని కాలమ్స్ తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. అక్టోబరు 31వ తేదీ వరకు వచ్చిన ఓటు హక్కు దరఖాస్తులను నవంబరు10వ తేదీ వరకు పూర్తి చేసి, సప్లిమెంటరీ ఓటర్ల తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని సీఈవో తెలిపారు. అక్టోబర్ 31 వరకు 59 లక్షల ఓటరు దరఖాస్తులు వచ్చాయని, ఇందులో కొత్తగా నమోదు కోసమే 36 లక్షలు వచ్చినట్లు చెప్పారు. యువ ఓటర్లు 9.10 లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు. 

10 తర్వాత ఓటరు స్లిప్​లు 

ఈసారి అదనంగా1500 నుంచి 2 వేల పోలింగ్‌‌‌‌ కేంద్రాలు రెడీ చేస్తున్నామని సీఈవో వికాస్​రాజ్​తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌‌‌‌ శాతం పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఈనెల10 తర్వాత ఓటర్ స్లిప్స్ ప్రింటింగ్ స్టార్ట్ చేసి పంపిణీ మొదలు పెడుతామన్నారు. ఆర్వో ఆఫీసులో ఫిర్యాదుల సెల్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీతో పాటు కొన్ని పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్​ శాతం తక్కువ నమోదు అవుతుందని, మిషన్ 29 కింద ఆ ప్రాంతాల్లో పోలింగ్ పెంచుతామని సీఈవో స్పష్టం చేశారు.