హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ విదేశీ విద్యానిధి స్కీంలో ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 20వ తారీఖు నుంచి జరుగుతుందని బీసీ వెల్ఫేర్ కమిషనర్ బుర్రా వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 2022లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్లో పెట్టిన వివరాల ప్రకారం.. తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో అటెండ్ కావాలని సూచించారు. ఈ స్కీం కోసం మొత్తం 571 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 438 మంది బీసీ,133 ఈబీసీ కులాలకు చెందిన వారని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా వెరిఫికేషన్తేదీ, సమయం, ఆఫీస్ అడ్రస్ వివరాలు పంపించామని వివరించారు.
