తిరగబడర సామీ.. చాలా బాగుందే సాంగ్ రిలీజ్

తిరగబడర సామీ..   చాలా బాగుందే సాంగ్ రిలీజ్

రాజ్ తరుణ్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్  నిర్మిస్తున్న చిత్రం ‘తిరగబడర సామీ’. మాల్వీ మల్హోత్రా హీరోయిన్. మన్నారా చోప్రా కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌‌‌‌ సినిమాపై పాజిటివ్ బజ్‌‌ను క్రియేట్ చేశాయి. గురువారం ‘చాలా బాగుందే’ అనే  సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. జేబీ కంపోజ్ చేసిన మెలోడీ పాటకు శ్రీమణి లిరిక్స్ రాశాడు. 

చైతు సత్సంగి, లిప్సిక కలిసి పాడారు. ఇందులో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జోడీ ఆకట్టుకుంది. షూటింగ్‌‌తో సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు దర్శక నిర్మాతలు. భాష్యశ్రీ ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. మకరంద్ దేశ్‌‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృథ్వి, ప్రగతి, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.