అన్ని కులాలకూ లక్ష రుణం ఇవ్వాలె : చాడ వెంకటరెడ్డి

అన్ని కులాలకూ లక్ష రుణం ఇవ్వాలె : చాడ వెంకటరెడ్డి

బీసీలకు లక్ష రూపాయల రుణం కొన్ని కులాలకే కాకుండా అన్ని కులాలకు ఇవ్వాలని  సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వడగళ్ల వానలతో నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఏదని ప్రశ్నించారు. గత పాలకుల మాదిరిగానే వ్యవసాయ రంగంపై  ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా లేదన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. 

రెవెన్యూ చట్టంలోని భూ సమస్యలు పరిష్కరిస్తామన్న కేసీఆర్ నేటి వరకు పరిష్కరించలేదన్నారు చాడ వెంకటరెడ్డి. ధరణి పోర్టల్ లో సమస్యలను పరిష్కరించి.. పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న 11 లక్షల మంది పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి అంటే హైవే లైన్లు మాత్రమేనా..? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలను ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు.