హుజూర్‌నగర్‌లో TRSకు మద్దతు ఇవ్వం : చాడ వెంకటరెడ్డి

హుజూర్‌నగర్‌లో TRSకు మద్దతు ఇవ్వం : చాడ వెంకటరెడ్డి

హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. మంచిర్యాలలో ఆర్టీసీ జేఏసీ శిబిరాన్ని సందర్శించిన చాడ వెంకటరెడ్డి.. కార్మికులకు సంఘీభావం తెలిపారు.

సీపీఐ… ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతు ఇస్తోందని చెప్పారు చాడ వెంకటరెడ్డి. హుజూర్ నగర్ లో జరిగే అసెంబ్లీ ఉపఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి తెలిపిన మద్దతును ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. సమ్మెతో సీఎం కేసీఆర్ కు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. తెలంగాణ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి కేసిఆర్ ప్లాన్ వేశారని అన్నారు.

48 వేల మంది కార్మికులను విధుల నుంచి తొలగిస్తామని ప్రకటించడంతోనే మనోవేదనకు గురై ఆర్టీసీ కార్మికులు ప్రాణ త్యాగాలకు సైతం పాల్పడుతున్నారన్నారు చాడ వెంకటరెడ్డి. గతంలో చంద్రబాబు నాయుడు ఆర్టీసీని, సింగరేణి ప్రైవేటీకరణ చేయాలని చూస్తే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరూ ఎన్నికలలో ఆయనకు సరైన బుద్ధి చెప్పారనీ.. అదే గతి కేసీఆర్ కు కూడా పడుతుందని అన్నారు చాడ.