హైకోర్టు న్యాయమూర్తిగా చాడ విజయ భాస్కర్‌‌రెడ్డి

హైకోర్టు న్యాయమూర్తిగా చాడ విజయ భాస్కర్‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన చాడ విజయ భాస్కర్‌‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. గురువారం ఉదయం 9.55 గంటలకు హైకోర్టు హాల్​లో ఆయనతో చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్ భూయాన్‌‌ ప్రమాణం చేయిస్తారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన విజయ​ భాస్కర్ రెడ్డి.. అక్కడే స్కూల్ చదువు పూర్తి చేశారు. ఓయూలో బీఎస్సీ, లా చదివారు. 1992 డిసెంబర్‌‌ 31న లాయర్‌‌గా ఎన్‌‌రోల్‌‌ అయ్యారు. పలు ప్రభుత్వ సంస్థలకు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ లాయర్​గానూ పనిచేశారు. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వ లాయర్​గా కొనసాగుతున్నారు.