IPL 2024: చరిత్ర సృష్టించిన చాహల్.. ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఒక్కడు

IPL 2024: చరిత్ర సృష్టించిన చాహల్.. ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఒక్కడు

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు.ఐపీఎల్ లో చరిత్రలో అత్యధికంగా 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సోమవారం  జైపూర్ వేదికగా ముంబై జట్టుతో జరుగుతున్న  మ్యాచ్ లో ఈ ఘనత సాధించారు. ముంబై బ్యాట్స్ మెన్ మహ్మద్ నబీ (23)ని ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్‌లో 200వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

 ముంబై, ఆర్సీబీ, రాజస్థాన్ జట్ల తరుపు ఇప్పటివరకు 153 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన చాహల్ 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. చాహల్ తర్వాత విండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో(183 వికెట్లు), ముంబై బౌలర్ పియూష్ చావ్లా(181 వికెట్లు), సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్(174 వికెట్లు), లక్నో బౌలర్ అమిత్ మిశ్రా(171 వికెట్లు) ఉన్నారు. కాగా, ఈ సీజన్ లో చాహల్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ ల్లో 13 వికెట్లు తీశాడు.