మేం యస్ ‌‌చెప్పేశాం.. ప్రేయసిని పెళ్లాడనున్న చహల్‌

మేం యస్ ‌‌చెప్పేశాం.. ప్రేయసిని పెళ్లాడనున్న చహల్‌

న్యూఢిల్లీ: టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయితో కలిసి కొత్త ఇన్నింగ్స్‌‌ మొదలు పెట్టబోతున్నాడు. లవ్‌ బర్డ్స్‌ చహల్, ధనశ్రీ వర్మ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఉత్తరాది సంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు జరిగే రోకా వేడుక శనివారం పూర్తయిందని చహల్‌ వెల్లడించాడు. ‘మా కుటుంబాలతో కలిసి మేం యస్‌ అనేశాం. రోకా సెర్మనీ జరిగింది’ అని చహల్ ‌ట్వీట్‌ చేశాడు. ట్రెడిషనల్‌ డ్రెస్‌లో ధనశ్రీతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌‌ చేశాడు.

చహల్ పెళ్లి చేసుకునే ధనశ్రీ డాక్టర్. అంతేకాదు ఫేమస్ కొరియోగ్రాఫర్ కూడా. యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలకు కొరియోగ్రఫీ చేసిందామె. యూట్యూబ్‌లో 1.5 మిలియన్ ఫాలోవర్స్‌‌ ఉన్న ధనశ్రీతో చహల్ ‌చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అయితే వీరిద్దరి మ్యారేజ్‌ ఎప్పుడనే దానిపై సమాచారం లేదు. లాక్‌‌డౌన్‌తో చాన్నాళ్లుగా ఇంటికే పరిమితం అయిన చహల్‌ వచ్చే నెల నుంచి యూఏఈలో జరిగే ఐపీఎల్‌తో మళ్లీ బిజీగా మారనున్నాడు. తొందర్లోనే అతను బెంగళూరు టీమ్‌తో కలిసి యూఏఈ వెళ్ల‌నున్నాడు. రోకా సెర్మనీ జరుపుకున్న చహల్‌కు టీమిండియా క్రికెటర్లు కంగ్రాట్స్‌‌ చెప్పారు.