హైదరాబాద్ లో చైన్ స్నాచర్స్ వీళ్లే.. ఇంటి ఎదుట మహిళ నిల్చొని ఉంటే..

హైదరాబాద్ లో చైన్ స్నాచర్స్ వీళ్లే.. ఇంటి ఎదుట మహిళ నిల్చొని ఉంటే..

హైదరాబాద్ సిటీలో మళ్లీ చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. మామూలు వ్యక్తులుగా బైక్స్ పై తిరుగుతూ.. ఒంటరి మహిళలను.. ఇంటి ఎదుట నిల్చొని ఉంటే మహిళలను టార్గెట్ చేస్తున్నారు.. వేగంగా వచ్చి.. మహిళల మెడలో బంగారం గొలుసులను తెంపుకుని.. అంతే వేగంగా వెళ్లిపోతున్నారు. హైదరాబాద్ సిటీ పరిధిలోని నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతుల్లా గూడలో ఇంటి ముందు నిల్చున్న సుక్కమ్మ అనే మహిళ మెడలోంచి 2తులాల మంగళ సూత్రం లాక్కెళ్లారు దుండగులు. బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించారు. అందులో దొంగలు నెంబర్ ప్లేట్ లేని ఓ వాహనాన్ని ఉపయోగించినట్టు కనిపించింది. దీంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.