చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం ఒంటరి ఆడవాళ్లను టార్గెట్ చేసుకుని మెడలోని పుస్తెలతాడు లాక్కెళ్తున్నారు దొంగలు.
లేటెస్ట్ గా ఖమ్మం జిల్లాలో రోటరీ నగర్ లో గుర్తు తెలియని ఓ వ్యక్తి బైక్ పై హెల్మెట్ పెట్టుకుని కిరాణా షాపు దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్, పెరుగు ప్యాకెట్ కావాలని అడిగాడు. వాటిని ఇస్తున్న క్రమంలో మహిళ మెడలోంచి మూడు తులాల పుస్తెలతాడు లాక్కొని పరారైయ్యాడు.
అందుకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.