
ఎల్బీనగర్, వెలుగు: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. ఇంటి ముందు నిల్చొని ఉన్న మహిళ మెడలోంచి రెండు తులాల మంగళసూత్రం లాక్కెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. మల్లికార్జున హిల్స్ లో నివాసం ఉంటున్న సుక్కమ్మ(51) ఆదివారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఇంటి ముందు నిలబడి ఉంది. అదే సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న చైన్ ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.