
కామారెడ్డి, వెలుగు : జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గాంధీనగర్‌కు చెందిన అనసూయ గురువారం సాయంత్రం పిల్లలతో వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మూడు తులాల పుస్తెలతాడును లాక్కొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.