హైదరాబాద్ ఉప్పల్ లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. శుక్రవారం (అక్టోబర్ 24) ఉదయం సెవెన్ హిల్స్ కాలనీలో వాకింగ్ కు వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు చైన్ లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు దొంగ. స్విగ్గీ టీషర్టుతో వచ్చిన దొంగ.. 4 తులాల గోల్డ్ చైన్ లాక్కుని పరారయ్యాడు.
పెద్దావిడ దొంగ దొంగ అని అరవడంతో అప్రమత్తమైన స్థానికులు.. దొంగను వెంబడించారు. చైన్ తో పరారైన దొంగ పారిపోయే క్రమంలో పక్క గల్లీ డెడ్ ఎండ్ లో ఇరుక్కుపోయాడు. దొంగను పట్టుకున్న స్థానికులు దేహశుద్ది చేశారు. దొంగ నుంచి గొలుసును స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. దొంగను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కేసు నమోదు చేవారు.
►ALSO READ | వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్షమే.. ప్రత్యక్ష సాక్షుల అభిప్రాయం ..
దొంగ స్విగ్గీ టీ షర్ట్ ధరించి ఉన్నాడని.. బైక్ పై వచ్చాడని కాలనీ వాసులు తెలిపారు. దొంగతనం తర్వాత పట్టుకునే ప్రయత్నం చేయడంతో చైన్ వదిలేసి పరిగెత్తే దొరికిపోయినట్లు చెప్పారు. గొలుసును బలంగా లాగడంతో పెద్దావిడ మెడపై స్వల్ప గాయాలు అయినట్లు తెలిపారు. ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్ కేసులు పెరగడంతో కాలనీ వాసుల్లో ఆందోళన నెలకొంది. తగిన భద్రత కల్పించాలని పోలీసులను కోరుతున్నారు.
