- నిజామాబాద్ సీపీ సాయిచైతన్య వెల్లడి
నిజామాబాద్, వెలుగు: ఇందూర్ లో చైన్ సిస్టమ్ మార్కెటింగ్ దందాతో రూ.కోటి టోపి పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని సీపీ సాయిచైతన్య తెలిపారు. గురువారం సీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. కోటగల్లీకి చెందిన చంద్రశేఖర్బీఎంబీ కంపెనీ పేరుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మిస్తున్నాడు. ఇన్వెస్ట్ చేసినవారు విత్డ్రా చేయడానికి ప్రయత్నిస్తే కావడం లేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. మల్టీలెవల్ చైన్ సిస్టమ్ లో నష్టపోయిన బాధితులు 770 మంది ఉన్నారన్నారు. చైనా బెస్ట్లింకులతో చైన్ సిస్టమ్ బిజినెస్ నడిపినట్లు తేలిందని, మరింత లోతుగా విచారణ చేస్తామన్నారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ సిబ్బంది ఉన్నారు.
