ఎస్​బీఐకి ఎనలిస్టుల పొగడ్తలు ఛైర్మన్​ దినేష్​ ఖారా

ఎస్​బీఐకి ఎనలిస్టుల పొగడ్తలు ఛైర్మన్​ దినేష్​ ఖారా

కోల్‌కతా: అత్యధిక లాభాలు ఆర్జించడంతో బ్రోకింగ్​ హౌస్​లు ఎస్​బీఐని మెచ్చుకుంటున్నాయని ఛైర్మన్​ దినేష్​ ఖారా చెప్పారు. దేశంలోని ఏ కార్పొరేట్​ హౌస్​ సంపాదించనంత లాభాన్ని ఎస్​బీఐ మొదటిసారిగా సాధించిందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఎనలిస్టులందరూ పొగుడుతున్నారని చెప్పారు. ఈ ఫైనాన్షియల్​ ఇయర్​ రెండో క్వార్టర్లో బ్యాంకు నికర లాభం 74 శాతం పెరిగి రూ. 13,265 కోట్లకి చేరిన విషయం తెలిసిందే. మోతిలాల్ ఓస్వాల్​ సెక్యూరిటీస్​, ఐసీఐసీఐ సెక్యూరిటీస్​లను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. ఇండియన్​ ఎకానమీని ఎస్​బీఐ ప్రతిఫలిస్తుందని ఖారా పేర్కొన్నారు. ఎందుకంటే 47 కోట్ల మంది కస్టమర్లతో దేశంలోని ప్రతి ఇంటినీ ఎస్​బీఐ చేరుకుందని చెప్పారు. 2027 నాటికి ఇండియా మూడో పెద్ద ఎకానమీగా అవతరించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కస్టమర్​ సర్వీస్​ను బ్యాంకు ఇంకా మెరుగుపరుచుకోవల్సి ఉందని చెబుతూ, పోటీ పెరిగిన ఈ టైములో ఇది చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. కస్టమర్లు కోరుకునే విధంగా ప్యాకేజ్​ఆఫర్లను బ్యాంకు తేవల్సి ఉంటుందని చెప్పారు. చాలా మంది కస్టమర్లు డిజిటల్​ వైపు మళ్లడంలో తమ బ్యాంకు కీలకపాత్ర పోషించిందని వివరించారు. టెక్నాలజీ లో ఎస్​బీఐ భారీగా పెట్టుబడులు పెట్టిందని, యోనో యాప్​ ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.