ఖమ్మం ఎస్ బీఐటీకి ప్రతిష్టాత్మక ఐబీఎమ్ ఎక్సలెన్స్ అవార్డు

ఖమ్మం ఎస్ బీఐటీకి  ప్రతిష్టాత్మక ఐబీఎమ్ ఎక్సలెన్స్ అవార్డు

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని ఎస్ బీఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు ప్రతిష్టాత్మక ఐబీఎమ్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నట్లు కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ శుక్రవారం తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన ఐబీఎమ్ సీఎస్ఆర్ యాన్యువల్ సమ్మిట్ 2025 పేరిట ఐబీఎం సంస్థ ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు అధికారులతో పాటు కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో అవార్డును అందుకున్నట్లు పేర్కొన్నారు.

 జాతీయ స్థాయిలో ఈ అవార్డుకు కేవలం 4 కళాశాలలను మాత్రమే ఎంపిక చేయగా తెలంగాణా నుంచి ఎస్ బీఐటీ కళాశాల ఒక్కటే ఎంపిక కావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఐబీఎం సంస్థ గత మార్చి నెలలో తమ కళాశాలలో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీపై 60, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీ పై 60 మంది విద్యార్థులకు శిక్షణను దిగ్విజయంగా నిర్వహించినందుకుగానూ గుర్తింపుగా ఈ అవార్డు వచ్చినట్లు కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ జి. ధాత్రి తెలిపారు. 

శిక్షణ అనంతరం నిర్వహించిన పరీక్షలలో 46 మంది విద్యార్థులు సైబర్ సెక్యూరిటీలో, 50 మంది విద్యార్థులు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీలో ఉత్తీర్ణత సాధించి సర్టిఫికెట్లు పొందారని చెప్పారు. ఐసీటీ అకాడమీతో కలిసి తమ కళాశాల ఎన్నో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రాజ్ కుమార్ తెలిపారు.

ఈ విద్యా సంవత్సరానికి గానూ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో పాటు డేటా ఎనలిటిక్స్ పై శిక్షణా కార్యక్రమం చేపట్టామన్నారు. అవార్డు అందుకున్న వారిలో కళాశాల జాయింట్ సెక్రటరీ గుండాల కవిత కూడా పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డాక్టర్ ఏవీవీ శివ ప్రసాద్, డాక్టర్ జె. రవీంద్రబాబు, టీపీవో ఎన్. సవిత, కోఆర్డినేటర్ డాక్టర్ జి. ప్రభాకర్, తదితరులు  పాల్గొన్నారు.