
హైదరాబాద్, వెలుగు : నేషనల్ ఇన్స్టిట్యూట్ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్టేష స్ (నీపా) ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరా బాద్ వేదికగా గురు, శుక్రవారాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్పై సదస్సు జరుగుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి వెల్లడించారు. నీపాకు చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం దీనిని నిర్వహిస్తున్నదని తెలిపారు. బుధవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సదస్సుకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణతో పాటు 14 రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. సదస్సులో యూజీసీ ఇచ్చే గైడ్లైన్లో వస్తున్న సమస్యలతో పాటు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై ఆయా రాష్ట్రాల ప్రతినిధుల అభిప్రాయాలను కూడా సేకరిస్తా " మని తెలిపారు.