ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారిగా చైతన్య జైని మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇన్చార్జ్ జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టిన లోకల్ బాడీస్ కలెక్టర్ శ్రీజ నుంచి చైతన్య జైని విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు.
అనంతరం ఆమె కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ అభ్యసన ఫలితాల సాధనే ధ్యేయంగా పనిచేసి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం జిల్లా అకాడమిక్ అధికారి మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్ రెడ్డి తో కలిసి నూతనంగా ప్రమోషన్ పొంది శిక్షణ పొందుతున్న టీచర్ల శిక్షణా కేంద్రాలను ఆమె సందర్శించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సేక్టోరియల్ అధికారి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
