బహుజన ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీక

బహుజన ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీక

హైదరాబాద్‌‌, వెలుగు: బహుజన ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీక అని సీఎం కేసీఆర్‌‌ అన్నారు. సోమవారం ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఆమె ధైర్యసాహసాలను కొనియాడుతూ సీఎం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చూపిన తెగువ ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం ఆమె జరిపిన పోరాటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వం ఉందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమని పేర్కొన్నారు.