
‘క్రేజీఫెలో’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మిర్నా మీనన్.. ‘ఉగ్రం’లో అల్లరి నరేష్‌కి జంటగా నటించింది. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మే 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మిర్నా మాట్లాడుతూ ‘ఇందులో నాది చాలెంజింగ్ రోల్. కాలేజీ అమ్మాయిగా, భార్యగా, ఒక బిడ్డకు తల్లిగా డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తాను. కెరీర్ బిగినింగ్‌లోనే ఇలాంటి పాత్ర చేయడం సవాల్‌గా అనిపించింది. యాక్టింగ్‌కు స్కోప్ ఉండే ఫుల్ లెంగ్త్ రోల్ దొరకడం హ్యాపీగా ఉంది. పోలీస్ ఆఫీసర్ భార్యగా.. బాధ్యత గత హౌస్‌వైఫ్‌గా కనిపిస్తా.
నరేష్ చాలా కూల్‌గా ఉంటారు. కామెడీ, సీరియస్ రెండు పాత్రలని అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు. కళ్ళతో హావభావాలు పలికిస్తారు. గ్రేట్ కోస్టార్. విజయ్ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. స్ర్కీన్‌ప్లే రాసుకున్న విధానం బాగా నచ్చింది. తను మంచి ఎడిటర్ కూడా. ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ రాత్రి వేళల్లోనే జరిగింది. 48 గంటలు బ్రేక్ లేకుండా షూట్ చేయడం డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. ఇక ఆల్రెడీ మోహన్‌లాల్ గారితో కలిసి నటించిన నేను, ఇప్పుడు ‘జైలర్’లో రజినీకాంత్ గారితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది.