గ్రూప్ 1పై విష ప్రచారం ఆపండి.. పీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్

గ్రూప్ 1పై విష ప్రచారం ఆపండి.. పీసీసీ జనరల్  సెక్రటరీ చనగాని దయాకర్

హైదరాబాద్, వెలుగు:  గ్రూప్-1 పరీక్షపై బీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ పిలుపునిచ్చారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్ వ్యాఖ్యలను ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్పారు. గ్రూప్-1 పోస్టులు అమ్ముకున్నారని మాట్లాడిన కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరుతున్నానన్నారు.

 అసత్య ప్రచారాలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, నిరుద్యోగుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. నిరుద్యోగుల న్యాయబద్ధ పోరాటాలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని, త్వరలో డీజీపీని కలిసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన ఫేక్ వీడియోలు, క్లిప్పింగ్స్‌‌‌‌‌‌‌‌పై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.