రాష్ట్రంలో ఐఐటీ సీట్లు పెంచండి..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చనగాని దయాకర్ విజ్ఞప్తి

రాష్ట్రంలో ఐఐటీ సీట్లు పెంచండి..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చనగాని దయాకర్ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐఐటీ సీట్లను పెంచాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్ లో కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. దేశంలో ఐఐటీ సీట్లను పెంచడంతో పాటు కొత్త ఐఐటీలు, ఐఐఎంలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ లో మరో ఐఐటీని ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న ఐఐటీలో సీట్ల సంఖ్యను 590కి పెంచాలని కేంద్ర మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. తెలంగాణ రాష్ట్రం విద్య, వైద్యం, సాంకేతిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ప్రతి ఏటా మన రాష్ట్రం నుంచి 10 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సులు చదివేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.