8 లక్షల జాబ్స్​కు ఛాన్స్​! ఈ జాబ్స్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్‌‌‌‌‌‌‌‌..

V6 Velugu Posted on Feb 26, 2021

  • ఫ్రంట్‌లైన్ వర్కర్లకు పెరుగుతున్న డిమాండ్‌
  • హైరింగ్ ప్రాసెస్‌లో సుమారు 1,100 కంపెనీలు
  • స్కిల్డ్‌ ఎంప్లాయీ-ఎంప్లాయర్‌‌ మ్యాపింగ్‌లో వెల్లడి

న్యూఢిల్లీ: మనదేశంలో ఎనిమిది లక్షల బ్లూ కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రే కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాబ్స్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని ఏఎస్‌‌‌‌‌‌‌‌ఈఈఎం డేటా చెబుతోంది. సుమారు1,100 కంపెనీలు తమ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌లైన్ జాబ్స్‌‌‌‌‌‌‌‌ను వెంటనే నింపాల్సి ఉందని పేర్కొంది. ఎకానమీ రికవరీ అవుతుండడం, కంపెనీల లాభాలు మెరుగుపడడం, స్టాక్ మార్కెట్లు పెరుగుతుండడం వంటి కారణాలతో కంపెనీలు తమ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులకు (ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లో పనిచేసేవారు) డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరిగిందని ఆత్మనిర్భర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కిల్డ్‌‌‌‌‌‌‌‌ ఎంప్లాయీ ఎంప్లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాపింగ్‌‌‌‌‌‌‌‌(ఏఎస్‌‌‌‌‌‌‌‌ఈఈఎం) ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లోని  డేటా ఆధారంగా తెలుస్తోంది. నేషనల్‌‌‌‌‌‌‌‌ స్కిల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేస్తున్న బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌ ఈ డేటాను షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. పెంటప్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌(ఒక్కసారిగా వచ్చే డిమాండ్‌‌‌‌‌‌‌‌) తగ్గినప్పటికీ, ‌‌‌‌‌‌‌‌రానున్న కొన్ని క్వార్టర్లలో కరోనా సంక్షోభం నుంచి బయటపడతామని కంపెనీలు భావిస్తున్నాయి.

రిటైల్‌‌‌‌‌‌‌‌, ఈ–కామర్స్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ జాబ్స్‌‌‌‌‌‌‌‌..

లాజిస్టిక్స్‌‌‌‌‌‌‌‌, రిటైల్‌‌‌‌‌‌‌‌, క్లాత్స్‌‌‌‌‌‌‌‌, హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐటీ, ఐటీఈఎస్‌‌‌‌‌‌‌‌, ఈ–కామర్స్‌‌‌‌‌‌‌‌ సెక్టార్లలో బ్లూ కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌( వర్కర్లు), గ్రే కాలర్‌‌‌‌‌‌‌‌ జాబ్స్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉందని, ఈ సెక్టార్లు ఎక్కువ మందిని నియమించుకుంటున్నాయని ఈ డేటా తెలిపింది. కరోనా వలన తీవ్రంగా నష్టపోయిన టూరిజం, హాస్పిటాలిటీ సెక్టార్లు కూడా గత రెండు నెలల్లో 8 వేల మందిని నియమించుకున్నాయని పేర్కొంది. ‘ఫ్రంట్‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌ వర్కర్స్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ క్రియేట్ అవ్వడం గమనిస్తున్నాం. ‌‌‌‌‌‌‌‌పెంటప్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ తగ్గిన తర్వాత కూడా వీరికి డిమాండ్‌‌‌‌‌‌‌‌ కొనసాగుతోంది. అన్ని సెక్టార్లలోనూ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌ లైన్ వర్కర్లకు డిమాండ్ ఉంది’ అని బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేస్‌‌‌‌‌‌‌‌ సీఓఓ సౌరభ్‌‌‌‌‌‌‌‌ టాండన్‌‌‌‌‌‌‌‌ అన్నారు. బ్లూ కాలర్ జాబ్స్‌‌‌‌‌‌‌‌కు శాలరీ రూ. 12,000–16,000 రేంజ్‌‌‌‌‌‌‌‌లో ఉండగా, గ్రే కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాబ్స్‌‌‌‌‌‌‌‌కు రూ. 18,000–25,000 మధ్యలో ఉందని బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేస్‌‌‌‌‌‌‌‌ చెబుతోంది.

పెద్ద కంపెనీల్లో హైరింగ్ పెరిగింది..

తమ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌లైన్ వర్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ను పెంచుతున్నామని లుపిన్, డాబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఈకామ్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ గ్రూప్‌‌‌‌‌‌‌‌ వంటి కంపెనీలు చెబుతున్నాయి. ఫ్రంట్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ జాబ్స్‌‌‌‌‌‌‌‌లోని ఖాళీలకే కాకుండా, కొత్త పొజిషన్లకు కూడా ఉద్యోగులను నియమించుకుంటున్నామని లుపిన్‌‌‌‌‌‌‌‌ గ్లోబల్‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ యశ్వంత్​ మహాదిక్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ‌‌‌‌‌‌‌‌మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌, క్వాలిటీ, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ డీ, సేల్స్‌‌‌‌‌‌‌‌ విభాగాల్లో ఫ్రంట్‌‌‌‌‌‌‌‌లైన్ వర్కర్లను హైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్నామని చెప్పారు. ప్యాసింజర్​ కార్లు, యుటిలిటీ వెహికల్స్‌‌‌‌‌‌‌‌, టూ వీలర్ల డిమాండ్‌‌‌‌‌‌‌‌ అంచనాల కంటే ముందే రికవరీ అయ్యిందని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ గ్రూప్‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను అంచనావేస్తున్నామని, రానున్న 3–6 నెలల్లో మరింత మందిని నియమించుకుంటామని తెలిపింది. ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ మేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాబర్ కూడా తన ఫ్రంట్‌‌‌‌‌‌‌‌ లైన్ వర్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ను పెంచుతోంది. డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో ఈ నియామకాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. డెలివరీ బాయ్స్‌‌‌‌‌‌‌‌కు సీజన్‌‌‌‌‌‌‌‌ బట్టి డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరుగుతుందని ఈకామ్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. కరోనాను డీల్‌‌‌‌‌‌‌‌ చేయడంలో ఏడాది కిందటితో పోలిస్తే ప్రస్తుతం కంపెనీలు బెటర్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎకానమీని షట్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ చేసే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోదని నమ్ముతున్నాయి. దీంతో తమ హైరింగ్‌‌‌‌‌‌‌‌ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌ను ముందుకు తీసుకెళుతున్నాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు.

ఈ జాబ్స్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్‌‌‌‌‌‌‌‌..

కొరియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌, రిటైల్‌‌‌‌‌‌‌‌ సేల్స్ అసోసియేట్స్‌‌‌‌‌‌‌‌, ఎమెర్జెన్సీ మెడికల్‌‌‌‌‌‌‌‌ టెక్నిషియన్స్‌‌‌‌‌‌‌‌, టైలరింగ్‌‌‌‌‌‌‌‌, మొబైల్ హార్డ్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ టెక్నిషియన్స్‌‌‌‌‌‌‌‌, మెషిన్ ఆపరేటర్ వంటి బ్లూ కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రే కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాబ్స్‌‌‌‌‌‌‌‌కు ఎక్కువగా డిమాండ్ ఉందని బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. స్కిల్స్‌‌‌‌‌‌‌‌ ఉండి మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్లలో పనిచేసే వారిని గ్రే కాలర్ వర్కర్స్ అంటున్నారు. గత రెండు నెలల్లో రిటైల్‌‌‌‌‌‌‌‌, ఈ–కామర్స్‌‌‌‌‌‌‌‌ సెక్టార్లలో ఫ్రంట్‌‌‌‌‌‌‌‌లైన్ వర్కర్ల డిమాండ్‌‌‌‌‌‌‌‌ 30 శాతం పెరిగిందని మ్యాన్‌‌‌‌‌‌‌‌ పవర్ గ్రూప్‌‌‌‌‌‌‌‌ ఇండియా తెలిపింది. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లో ఎంట్రీలెవెల్‌‌‌‌‌‌‌‌ జాబ్స్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్‌‌‌‌‌‌‌‌ నిలకడగా పెరుగుతూ వస్తోందని పేర్కొంది. నెలవారీగా 10 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌ ఉందని తెలిపింది. ‘ఎంట్రీలెవెల్‌‌‌‌‌‌‌‌, సర్వీస్‌‌‌‌‌‌‌‌, డెలివరీ జాబ్స్‌‌‌‌‌‌‌‌కు నెలవారీగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది’ అని మ్యాన్‌‌‌‌‌‌‌‌పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌ ఇండియా గ్లోబల్‌‌‌‌‌‌‌‌ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​  అలోక్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌ కూడా ప్రారంభమవ్వడంతో  ఈ జోరు  కొనసాగుతోందని చెప్పారు.

ఏఎస్‌ఈఈఎం ప్లాట్‌ఫామ్‌లోని డేటా ప్రకారం..
డిమాండ్ ఎక్కువగా ఉన్న ఉద్యోగాలు..
కొరియర్‌‌‌‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌, రిటైల్ సేల్స్‌‌ అసోసియేట్‌, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నిషియన్‌‌, టైలరింగ్‌‌, కుట్టు మిషన్లను ఆపరేట్‌ చేసేవారు, మొబైల్
హార్డ్‌ వేర్ టెక్నిషియన్‌‌, మెషీన్ ఆపరేటర్స్‌‌, డేటా ఎంట్రీ ఆపరేటర్స్

‌‌హైరింగ్‌ చేసుకుంటున్న టాప్ సెక్టార్లు..
లాజిస్టిక్స్‌, ఈ-కామర్స్‌, రిటైల్‌, క్లాత్స్‌, హెల్త్ కేర్‌‌, ఐటీ, ఐటీ-ఈఎస్‌, మాన్యు ఫాక్చరింగ్‌

Tagged business, jobs, Hiring, companies, frontline workers, ASEEM, e-commerce, skilled employee-employer mapping

Latest Videos

Subscribe Now

More News