హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిల చెల్లింపునకు మున్సిపల్ శాఖ వన్ టైం స్కీం (ఓటీఎస్) తెచ్చింది. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రం లోని అన్ని మున్సిపాలిటీల్లో కలిపి రూ. 1,999.24 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయని అధికారులు తెలిపారు. చెల్లింపుదారులు తమ బకాయిల్లో 90 శాతం (చెల్లించాల్సిన అసలు, పెనాల్టీ, ఇంట్రస్ట్ కలిపి) చెల్లించాలని సూచించారు. ఈ ఏడా ది అక్టోబర్ 31లోగా ఓటీఎస్ కింద పన్ను బకాయిలు చెల్లించవచ్చని తెలిపారు.
