ఈరోజు రేపు భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం 

V6 Velugu Posted on Jul 22, 2021

  • వాతావరణశాఖ హెచ్చరిక

హైదరాబాద్: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సతమతం అవుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు.. రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తగా భారీ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణశాఖ అంచనా ప్రకారం రేపు రాత్రి 8.30 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నట్లు సమాచారం. 
ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే జిల్లాల జాబితాను ప్రకటించింది. ఆదిలాబాద్, కొమురంభీం, అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా, కామారెడ్డి జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కొమురంభీం, అసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. 
 
 

Tagged Telangana today, , rains update today, telangana rains update, today weather report, telangana weather bulletin today, monsoon updates

Latest Videos

Subscribe Now

More News