ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌కు బానిసై ..యువకుడు సూసైడ్‌‌‌‌.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఘటన

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌కు బానిసై ..యువకుడు సూసైడ్‌‌‌‌.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఘటన

కొత్తపల్లి, వెలుగు : ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌కు అలవాటు పడిన ఓ యువకుడు, డబ్బులు నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్‌‌‌‌ జిల్లా కొత్తపల్లి పట్టణంలో బుధవారం జరిగింది. సీఐ కోటేశ్వర్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపల్లి పట్టణానికి చెందిన తోట సుజాతకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. సుజాత పెద్దకొడుకు ఆదిత్య (34) డ్రైవర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. 

ఇతడు కొంతకాలంగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌కు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు గేమ్స్‌‌‌‌ ఆడడం మానేయాలని సూచించారు. అయినా వినకుండా.. తనకు డబ్బులు ఇవ్వాలని మంగళవారం కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడు. 

కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వకపోవడంతో అదే రోజు రాత్రి తన గతిలో ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం కుటుంబసభ్యులు గమనించేసరికే చనిపోయాడు. మృతుడి తల్లి సుజాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.