గొల్లపల్లి, వెలుగు: గంజాయి తరలించిన కేసులో ముగ్గురికి ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తూ జగిత్యాల జిల్లా ఫస్ట్ సెషన్స్ జడ్జి నారాయణ బుధవారం తీర్పుచెప్పారు. గొల్లపల్లి ఎస్ఐ కృష్ణాసాగర్‌రెడ్డి వివరాల ప్రకారం.. జగిత్యాల మండలం బాలపల్లికి చెందిన మారంపల్లి లక్ష్మణ్, గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన దొమ్మటి కార్తిక్, పెగడపల్లి మండలకేంద్రానికి చెందిన మల్యాల అజయ్ 2024 ఫిబ్రవరి 16న బైక్‌పై సుమారు 13కేజీల గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి ఏడేండ్ల జైలు శిక్షతోపాటు రూ.15వేల చొప్పున ఫైన్ విధిస్తూ జడ్జి తీర్పుచెప్పారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్ఐ సతీశ్, పీపీ మల్లేశంగౌడ్, తదితరులను ఎస్పీ అభినందించారు.
