- సీఎం హామీ మేరకు వెంటనే సమస్యలను పరిష్కరించాలి
- బాసర ట్రిపుల్ ఐటీ వద్ద కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరసన
బాసర, వెలుగు: నిర్మల్ జిల్లాలోని బాసర త్రిబుల్ ఐటీ యూనివర్సిటీ కాంట్రాక్ట్ లెక్చరర్లు బుధవారం నిరసనకు దిగారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, జీవో నంబర్ 21ని వెంటనే రద్దుచేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ లెక్చరర్ల సమ్మెకు సానుకూలంగా స్పందించి, డిమాండ్లు నెరవేరుస్తానని హామీ ఇచ్చారన్నారు. 8 నెలలు కావస్తున్నా సమస్యను పరిష్కరించలేదన్నారు. సీఎం హామీ మేరకు తమకు న్యాయం చేసిన తర్వాత రెగ్యులర్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
పీఆర్సీ విషయమై సంబంధిత అధికారులు, వీసీలను ఆదేశించాలని ఆర్జీయూ కేటీ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మస్టర్ బాసర (టీం) కోరింది. నిరసనలో కాంట్రాక్ట్ లెక్చరర్లు డా. ఎన్. విజయ్, డా. కె.రాములు, శ్రీధర్, బి.హరికృష్ణ, బి. శ్రీకాంత్, ఎ. విజయ్, బాలచందర్, బసవ శేఖర్, భానుప్రియ, డా. ఎం. రమాదేవి, యు. ప్రభాకరరావు, డి.వసంత్, ఎం. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
