బాసర ఎస్సైగా నవనీత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

బాసర ఎస్సైగా నవనీత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

బాసర, వెలుగు: బాసర మండల ఎస్సైగా నవనీత్ రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతలకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. 

ఎవరూ చట్టాన్ని అతిక్రమించవద్దని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.