భారీ వర్షాలు పడే ఛాన్స్... సిటీ జనం అప్రమత్తంగా ఉండాలె

భారీ వర్షాలు పడే ఛాన్స్... సిటీ జనం అప్రమత్తంగా ఉండాలె

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం ఒక్కసారిగా వెదర్ మారుతోంది. ముసురు వానతో మొదలైన దంచి కొడుతోంది. హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. గత మూడు రోజులుగా పడుతున్న వానలతో జనం ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ళల్లోతు నీళ్ళు ఉంటున్నాయి. హైదరాబాద్ సిటీలో నిన్న మధ్యాహ్నం తర్వాత కురిసిన వానతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్ని కాలనీల్లోకి మోకాలి లోతు నీళ్లు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలకు LB నగర్ లోని అయ్యప్ప నగర్ కాలనీ నీట మునిగింది. ఇళ్ల నుంచి జనం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్లపై మోకాలిలోతు నీళ్లు నిలిచాయి. డ్రైనేజీలు బ్లాక్ అవడంతో మురుగునీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది.

మరోవైపు రాష్ట్రానికి అధికారులు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. దక్షిణ, సెంట్రల్ జిల్లాలు అప్రమతంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉండటంతో సిటీ జనం అప్రమత్తంగా ఉండాలంటుని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.