మరో 3 రోజులపాటు వర్షాలు

మరో 3 రోజులపాటు వర్షాలు
  • ఉపరితల ఆవర్తనంతో విస్తారంగా వర్షాలు
  • 10 జిల్లాలకు 2 రోజులు యెల్లో అలర్ట్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తర్వాతి రెండ్రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో 11.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.