తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ, రేపు హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా.. కల్లాల్లో ధాన్యం పోసిన రైతులు వడ్లు తడవకుండా కాపాడుకోవాలన్నారు. రానున్న రెండు, మూడ్రోజుల్లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అండమాన్ లో అల్పపీడనం ఏర్పడందని.. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న. వాయుగుండం ఈ నెల 18న తీరం దాటే అవకాశం ఉందని.. దాని ప్రభావంతో వర్షాలు పడుతున్నాయన్నారు.