
రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. మరోవైపు రాష్ట్రంలో టెంపరేచర్లు భారీగా పెరిగాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలోని చాప్రాలలో అత్యధికంగా 43.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భోరజ్ లో 43.6, జగిత్యాలలోని ఎండపల్లిలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. అలాగే నిజామాబాద్ అర్బన్ లో 42.3, రాజన్న సిరిసిల్లలోని నేరెళ్ల, కొమురంభీం ఆసిఫాబాద్ లోని సిర్పూర్ లో 42.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.