ఈ సమ్మర్​ చాలా హీట్ !: టెంపరేచర్ పెరిగే చాన్స్​

ఈ సమ్మర్​ చాలా హీట్ !: టెంపరేచర్ పెరిగే చాన్స్​

గతేడాదితో పోలిస్తే టెంపరేచర్ పెరిగే చాన్స్​
పదేళ్లలో 42 -44  డిగ్రీలుగా నమోదు
ఈసారి 45 డిగ్రీలు ఉండొచ్చు
సిటీ వాతావరణ శాఖ అధికారులు

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది సమ్మర్ సీజన్ కొద్దిరోజుల్లోనే షురూ కానుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి సిటీ లో సమ్మర్ మరింత హీట్​గా  ఉండనుంది. దాదాపు 42 నుంచి 45 డిగ్రీల ఉష్టోగ్రతలు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గత10 ఏళ్లలో సిటీలో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మునుపటితో పోలిస్తే ఈసారి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగే చాన్స్​ ఉండొచ్చని తెలిపారు. ఈ ఏడాది వానాకాలం, చలికాలం రెండు సీజన్లు మాములుగానే ఉన్నాయి. వర్షాకాలంలోనైతే ఏకంగా వందేళ్ల నాటి వరదలను గుర్తు చేస్తూ భారీగా  వానలు పడ్డాయి. దీంతో అనేక ప్రాంతాలు  మునిగిపోయాయి. వరదలతో సిటీ ఆగమైంది. ఇలాగే సమ్మర్​లో కూడా టెంపరేచర్ అధికంగానే ఉంటుందని అనుకుంటుండగా, వాతావరణ శాఖ కూడా ఇదే చెబుతుంది.

మామూలు నుంచి అధికంగా..

ఈసారి ఎండలు మోస్తరు నుంచి అధికంగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నాం.  45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్​ ఉంది.  ఫోర్ కాస్ట్ రిపోర్ట్ ని కూడా రెడీ చేస్తున్నాం. ఏ నెలలో ఎంత మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయనేది, వడగాల్పులు, తీవ్రగాల్పులు ఎలా ఉండనున్నాయోననే సమాచారంలో రిలీజ్ చేస్తాం. వచ్చే పదిరోజులు ఎలా ఉంటుంది అనేది కూడా ముందే ఫోర్ కాస్ట్ రెడీ చేసి ప్రజలకు తెలియజేస్తాం.                                                                – నాగరత్న, సైంటిస్ట్- ఈ అండ్ హెడ్, వాతావరణ శాఖ, హైదరాబాద్