ఏటీఎం చార్జీలు పెరిగే చాన్స్

ఏటీఎం చార్జీలు పెరిగే చాన్స్

ఇంటర్‌ చేంజ్‌ ఫీజు పెంపు కోరిన ఆపరేటర్స్‌‌
కమిటీ రికమండేషన్లను 
అమలు చేయాలని వినతి

న్యూఢిల్లీ: ఏటీఎం నుంచి డబ్బు తీసుకుంటున్నప్పుడు విధించే ఇంటర్‌‌‌‌చేంజ్‌‌ ఫీజును పెంచాలని రిజర్వ్‌‌ బ్యాంక్‌‌(ఆర్‌‌‌‌బీఐ)కు ఇండియా ఏటీఎం ఆపరేటర్స్‌‌ ఆసోసియేషన్‌‌ లెటర్‌‌‌‌ రాసింది. ఏటీఎం ఇండస్ట్రీ నష్టాల్లో ఉందని, ఇంటర్‌‌‌‌చేంజ్‌‌ ఫీజులను పెంచడం చాలా అవసరమని ఈ అసోసియేషన్‌‌ పేర్కొంది. ఈ ఫీజును పెంచకపోతే, కొత్తగా ఏటీఎంలను ఏర్పాటు చేయడం కష్టమని తెలిపింది. కాగా సెక్యు రిటీ, ఏటీఎం నిర్వహణకు సంబంధించి ఆర్‌‌‌‌బీఐ కొత్తగా నిబంధనలను తీసుకొచ్చింది. వీటిని వేగంగా అమలు చేయాలని ఏటీఎం ఆపరేటర్లకు ఆర్‌‌‌‌బీఐ ఆదేశాలిచ్చిందని పరిశీలకులు తెలిపారు. ఏటీఎం నిర్వహణకు ఆటంకం కలగకుండా ఉండాలంటే ఇంటర్‌‌‌‌చేంజ్‌‌ ఫీజుల ద్వారా రెవెన్యూను పెంచుకోవాల్సి ఉందని అన్నారు.

ప్రస్తుతం రూ.15 వసూలు

ప్రస్తుతం ఒక ఏటీఎం విత్‌ డ్రా ట్రాన్సా క్షన్‌‌కు ఆపరేటర్లు రూ. 15 చొప్పున వసూలు చేస్తున్నారు. బ్యాంకు లు ఒక కస్టమర్‌‌‌‌కు గరిష్టంగా ఐదు ట్రాన్సా క్షన్‌‌లను ఫ్రీగా అందిస్తున్నాయి. రోజువారీ ఏటిఎం కార్యకలాపాలను కొనసాగించడానికి ఈ నిబంధనలను మార్చాలని కాన్ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఏటీఎం ఇండస్ట్రీ(సీఏటీఎంఐ) తెలిపింది. ప్రస్తుతం ఏటీఎం వ్యాపారాలు నష్టాల్లో కొనసాగుతున్నాయని, దీని ప్రభావంతో బ్యాంకు లు, వైట్‌‌ లేబల్‌‌ ఏటీఎం ఆపరేటర్స్‌‌(నాన్‌‌ బ్యాంకింగ్ ఏటీఎం ఆపరేటర్స్‌‌) కొత్తగా ఏటీఎం మెషిన్లను ఏర్పాటు చేయడానికి వెనకడుగేస్తున్నాయని పేర్కొంది. దీనికి తోడు చిప్‌ కార్డులకు మారడం వంటి నిబంధనలను ఆర్‌‌‌‌బీఐ తీసుకు రావడంతో ఏటీఎం నిర్వహణలో ఖర్చు పెరుగుతోందని తెలిపింది.

హైలెవెల్‌ కమిటీ సిఫార్సుల అమలెప్పుడు?

ఇండియాలో ఏటీఎంల విస్తరణ కోసం 2019లో ఆర్‌‌‌‌బీఐ ఒక హైలెవెల్‌‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఇంటర్‌‌‌‌ చేంజ్‌‌ ఫీజులను పెంచాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. పది లక్షల కంటే ఎక్కు వగా జనాభా ఉన్న పట్టణ ప్రాంతాలలో ఏటీఎం ఇంటర్‌‌‌‌ చేంజ్‌‌ ఫీజును రూ. 17(ఫైనాన్సియల్‌‌) కి, నాన్‌‌ ఫైనాన్సియల్ ట్రాన్సా క్షన్‌‌కు రూ. 7 కి పెంచాలని ఈ కమిటీ రిపోర్టిచ్చింది. అంతేకాకుండా ఫ్రీ ఏటీఎం విత్‌ డ్రాయల్స్‌‌ను మూడుకి పరిమితం చేయాలని తెలిపిం ది. రూరల్‌‌, సెమీ అర్బన్‌‌ ప్రాంతాలలో ఫైనాన్షియల్‌‌ ట్రాన్సా క్షన్‌‌ల పై రూ. 18లను, నాన్‌‌ ఫైనాన్షియల్‌‌ ట్రాన్సక్షన్‌‌లపై రూ. 8లను ఇంటర్‌‌‌‌చేంజ్‌‌ ఫీజుగా వసూల్‌‌ చేయాలని నివేదించింది. ఇక్కడ ఫ్రీ ట్రాన్సాక్షన్‌‌లను గరిష్టంగా ఆరుకు పరిమితం చేయాలంది. కాగా ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్లపై ఏటీఎం ఇండస్ట్రీ పాజిటివ్‌ గా ఉన్నప్పటికి , ఇంకా ఆర్‌‌‌‌బీఐ స్థాయిలో ఇవి అమలులోకి రాలేదు. వీటిని అమలు చేయడంలో సాఫ్ట్‌ వేర్‌‌‌‌ను అప్‌ డేట్‌‌ చేయాల్సి ఉందని పరిశీలకులు తెలిపారు.

ఏటీఎంలు తక్కువే..

ఆర్‌‌‌‌బీఐ డేటా ప్రకారం ప్రస్తుతం ఇండియాలో 2,27,000 ఏటీఎంలు పనిచేస్తున్నాయి. ఇందులో 21,300 ఏటీఎంలు వైట్‌‌లేబల్‌‌ మెషిన్స్‌‌ కాగా, మిగిలినవి బ్యాంకులు నిర్వహిస్తున్నాయి. ఖర్చులు పెరగడంతో 2018 తర్వాత నుంచి బ్యాంకులు కొత్తగా ఏటీఎంలను ఏర్పాటు చేయడం తగ్గించేశాయి. ఇండియాలో ప్రతి ఐదు ఏటిఎంలలో ఒక ఏటీఎం మాత్రమే గ్రామీణ ప్రాంతాలలో విస్తరించి ఉందని ఆర్‌‌‌‌బీఐ డేటా పేర్కొంది. కేవలం ప్రైవేట్‌‌ బ్యాంకుల పరంగా చూస్తే ప్రతి 10 ఏటీఎంలలో ఒక ఏటీఎం మాత్రమే గ్రామాల్లో విస్తరించి ఉంది. భవిష్యత్తులో ఏటీఎంల విస్తరణ మెరు గుపడడానికి ఏటీఎం ఇంటర్‌‌‌‌చేంజ్‌‌ ఫీజు పెంచాలని సీఏటీఎంఐ తెలిపిం ది. 2019 లో హైలెవెల్‌‌ కమిటీ ఇచ్చి న రికమెండేషన్లను వేగంగా అమలు చేయాలని కోరింది.

మరిన్ని వార్తల కోసం