రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్

రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్

 తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో కొమరీన్‌ ప్రాంతంపై అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొంచెం బలహీన పడింది. వీటి ప్రభావంతో మూడు రోజుల పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలు కురిసి తెలంగాణలో రైతులు తీవ్రఇబ్బంది పడ్డారు. వరి ధాన్యం బస్తాలు చాలా చోట్ల తడిసిపోయాయి. పండిన పంట మార్కెట్‌కు వెళ్లాల్సిన సమయంలో వర్షం కురవడంతో రైతులు నష్టపోయారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పింది.