దేశవ్యాప్తంగా ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలు

దేశవ్యాప్తంగా ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో హర్ ఘర్ తిరంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్టేడియంలో మానవహారంతో ఎగురుతున్న మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన ఈ దృశ్యం శనివారం చండీగఢ్ లో కనువిందు చేసింది. చండీగఢ్ వర్సిటీ, ఎన్ఐడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5,885 మంది మానవహారంలా నిలబడి ఈ తిరంగాను క్రియేట్ చేశారు. దీంతో ‘లార్జెస్ట్ హ్యూమన్ ఇమేజ్ఆఫ్ ఏ వేవింగ్ నేషనల్ ఫ్లాగ్’గా ఇది యూఏఈ పేరిట 
ఉన్న గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టింది.

హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ లో ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ పాల్గొన్నారు. శనివారం గుజరాత్ గాంధీనగర్ శివార్లలో ఆమె నివాసం వద్ద పిల్లలకు జాతీయ జెండాలను పంచి పెట్టారు.  ఇటీవలే ఆమె వందో ఏట అడుగుపెట్టారు.

75 ఏండ్ల స్వతంత్ర సంబురాల్లో భాగంగా వందలాది మంది స్కూల్ స్టూడెంట్లు జెండాలతో ర్యాలీ నిర్వహించారు. బెంగళూరులోని విధాన సౌధ వద్ద సీఎం బసవరాజ్ బొమ్మై ఏర్పాటు చేసిన హర్ ఘర్​ తిరంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.