
తెలంగాణ ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు ఏపీ సీఎం చద్రబాబు నాయుడు. పరీక్షలే జీవితం కాదని.. తల్లిదండ్రులుకు గర్భశోకం మిగిలించొద్దని అన్నారు. బాధిత కుటుంబాలకు తన సానుబూతిని ప్రకటించారు. పరీక్షలు ప్రతిభకు గుర్తింపు మాత్రమే అని.. అవే జీవితం కాదని అన్నారు. ప్రపంచంలో విజేతలుగా నిలిచినవారు ముందు ఓడిపోయిన వారేనని చెప్పారు. దేశభవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని అలాంటి యువత ఆత్మహత్యలకు పాల్పడటం తనను కలిచివేసిందని చెప్పారు. చదువు విజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని.. మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన సూసైడ్ చేసుకోవద్దని విద్యార్థులకు దైర్యం చెప్పారు చంద్రబాబు నాయుడు.
పరీక్షలో ఫెయిల్ అయ్యామని తెలంగాణ రాష్ట్రంలో 16 మంది ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధ కలిగించాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం నన్ను కలిచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
— N Chandrababu Naidu (@ncbn) April 23, 2019