వివేకా హత్యకేసు.. దేశ చరిత్రలోనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ : చంద్రబాబు

వివేకా హత్యకేసు.. దేశ చరిత్రలోనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ : చంద్రబాబు

వైసీపీలోని చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తాము సిద్ధమేనని.. 175 స్థానాల్లో వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని  స్పష్టం అని చెప్పారు.  జగన్ ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు.  తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారన్న చంద్రబాబు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి శాశ్వత చికిత్స చేస్తారని అన్నారు. ఏప్రిల్ ఫూల్ అనే పదం జగన్‌కి సరిగ్గా సరిపోతుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ప్రజలందర్నీ ఎల్లకాలం ఫూల్స్ చేయొచ్చనే భ్రమలో సీఎం  జగన్  ఉన్నారని.. కానీ ప్రజలంతా కలిసి ఆయనను ఫూల్ చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. రాష్ట్రంలో మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసు.. దేశ చరిత్రలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌.  ఫిక్షన్‌  అని కథలు రాసే వారు కూడా ఇలాంటివి రాయలేరని చెప్పారు. ఇన్ని ట్విస్టులు ఉన్న కేసు దేశంలో మరొకటి లేదని అన్నారు. ఇలాంటి కేసు పోతే.. వ్యవస్థల మీద నమ్మకం పోతుందని చంద్రబాబు తెలిపారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను జగన్ దెబ్బ తీశారని దానిని అధికారంలోకి వచ్చి దానిని  సరిచేస్తామని తెలిపారు.