సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ : చంద్రబాబుకు మంచి మిత్రుడు

సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ : చంద్రబాబుకు మంచి మిత్రుడు

చంద్రబాబు మిత్రుడు, సింగపూర్‌ రవాణాశాఖ మాజీ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ అరెస్ట్‌ అయ్యారు. ప్రధాని ఆదేశాలతో ఇటీవలే పదవి నుంచి తప్పుకున్న ఈశ్వరన్‌ను జూలై 11న అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యాడని అత్యున్నత దర్యాప్తు సంస్థ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (సీపీఐబీ)   వెల్లడించింది.

చంద్రబాబుకు అత్యంత ఆప్త మిత్రుడు

భారత సంతతికి చెందిన సింగపూర్  మాజీ మంత్రి ఎశ్ ఈశ్వరన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఆప్త మిత్రుడు. సింగపూర్ రవాణా మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో మంత్రి ఈశ్వరన్‌ని విచారించేందుకు కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (సీపీఐబీ) అనుమతినివ్వాలని కోరింది. దీనిపై వెంటనే స్పందించిన ప్రధాని లూంగ్ విచారణకు అనుమతినిచ్చారు. ఈ కేసులో నిందితులెవరైనా సరే ఖచ్చితంగా విచారణ జరిగి తీరుతుందని.. అప్పటి వరకూ ఈశ్వరన్ లాంగ్‌ లీవ్ తీసుకోవాలని ఆదేశించారు. ఈశ్వరన్ ను పక్కన పెట్టి తాత్కాలికంగా రవాణా మంత్రిగా వేరే వ్యక్తిని నియమించారు. మంత్రి ఈశ్వరన్‌ కొన్ని అక్రమ లావాదేవీలు జరిపినట్టు ఆధారాలు సేకరించిన సీపీఐబీ.. ఈశ్వరన్ అత్యంత సన్నిహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త హూంగ్‌ బెంగ్ సెంగ్‌ ను అరెస్ట్ చేసింది.

ఈశ్వరన్ అత్యంత సన్నిహితుడు అరెస్ట్

ఈశ్వరన్‌పై విచారణ ప్రారంభించిన మరుసటి రోజే CPIB  ఆయన సన్నిహితులపై కూడా దృష్టి సారించింది. మంత్రి ఈశ్వరన్‌ కొన్ని అక్రమ లావాదేవీలు జరిపినట్టు ఆధారాలు సేకరించి.. దీనికి సంబంధించి ఈశ్వరన్ అత్యంత సన్నిహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త హూంగ్‌ బెంగ్ సెంగ్‌ ను అరెస్ట్ చేసింది. 

హూంగ్‌ బెంగ్ సెంగ్‌ ఒక హోటల్ అధినేత. ఆయన సంస్థ పేరు హోటల్ ప్రాపర్టీస్ లిమిటెడ్(HPL). దీని వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్‌ కూడా. 2008లో ఫార్ములా వన్ రేస్‌ను సింగపూర్‌కు తీసుకువస్తానంటూ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేసి కాంట్రాక్టు సంపాదించారు సెంగ్. ఈ కాంట్రాక్టు మొత్తం విలువ 135 మిలియన్ డాలర్లు. 

ALSO READ :కాంగ్రెస్ లోకి వెళ్లడం లేదు.. బీజేపీలోనే ఉంటా : మాజీ ఎంపీ రాథోడ్ రమేష్

అమరావతికి ఈశ్వరన్ కు లింక్ ..

అమరావతి రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి  ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్‌ సంస్థలను చంద్రబాబు హయాంలో  తెరమీదకు తెచ్చారు. అసెండాస్‌–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్‌ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును అప్పగిస్తూ 2017 మే 12న ఈశ్వరన్‌తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. సింగపూర్ ప్రభుత్వమే అమరావతి ప్రాజెక్టు చేపడుతుందని చంద్రబాబు ప్రకటించారు. సింగపూర్ లోని ప్రైవేట్ కంపెనీల కన్సార్టియానికి ప్రభుత్వానికి సంబంధం లేకున్నా.. ఈశ్వరన్ ఎక్కడా ఆ విషయాన్ని బయటపెట్టలేదు. 

అనుమానాస్పదంగా ఈశ్వరన్ వ్యవహార శైలి

ఇక మొదటి నుంచి ఈశ్వరన్ వ్యవహారశైలి అనుమానస్పదంగానే ఉందన్నది సింగపూర్ వర్గాల సమాచారం. ప్రభుత్వంతో సంబంధం లేని ప్రాజెక్టుల్లో తలదూర్చడం, భారీ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని మభ్యపెట్టడం, కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తారన్న ఆరోపణలున్నాయి.