చంద్రబాబుకు గుండె జబ్బు ఉంది : కోర్టుకు తెలిపిన లాయర్లు

చంద్రబాబుకు గుండె జబ్బు ఉంది : కోర్టుకు తెలిపిన లాయర్లు

 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పై ఉన్న   అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలను న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం చంద్రబాబు గుండె జబ్బుతో బాధపడుతున్నారని నివేదికలో పేర్కొన్నారు.  చంద్రబాబు కంటి ఆపరేషన్‌, ఆరోగ్య పరిస్థితి వివరాలను ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. వైద్యుల సూచనల మేరకు నివేదికను మెమో ద్వారా కోర్టుకు అందించారు.

 చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గుండె పరిమాణం పెరిగింది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలున్నాయి. మధుమేహం అదుపులో ఉంది.. జాగ్రత్తలు పాటించాలి. ఆయనకు తగినంత విశ్రాంతి అవసరం’’ అని వైద్యులు సూచించిన నివేదికను కోర్టుకు అందించారు.

చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆయన కోలుకోవడానికి తప్పనిసరిగా మందులు వాడాలి. ఐదు వారాల పాటు ఐ చెకప్‌ కోసం షెడ్యూల్‌ ఇచ్చాం. కంటికి 5 వారాల పాటు ఇన్‌ట్రా ఆక్యులర్‌ ప్రెజర్‌ చెక్ చేసుకోవాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. 5 వారాల పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలి