ఢిల్లీ ఏపీ భవన్ లో ధర్మ పోరాట దీక్ష చేస్తున్న చంద్రబాబు.. కేంద్రం తీరుపై విమర్శలు చేశారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరితే.. తమ నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీతో దాడులు చేయిస్తున్నారని అన్నారు చంద్రబాబు. విభజన గాయం ఇంకా మానలేదని.. దాన్ని మోడీ మరింత పెద్దది చేస్తున్నారని ఆరోపించారు. హామీలు నెరవేర్చకుండా తప్పు చేశామని పార్లమెంట్ లో మోడీ క్షమాపణ చెప్పాలని బాబు డిమాండ్ చేశారు. పాలకుడిగా ఆయన ధర్మాన్ని మరిచారని.. అలాంటి వ్యక్తికి పదవిలో ఉండే అర్హత లేదన్నారు . అధికారం తలకెక్కితే… దాన్ని ప్రజలు దించేస్తారని హెచ్చరించారు.
