జీవో 1 కాపీలను భోగిమంటల్లో వేసిన చంద్రబాబు

జీవో 1  కాపీలను భోగిమంటల్లో వేసిన చంద్రబాబు

తన స్వగ్రామం నారావారి పల్లెలో జరిగిన భోగీ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నంబర్ 1ని భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ప్రజలపై పన్నులు, ఛార్జీలు వేస్తూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. జగన్ పాలనతో ఏపీ బ్రాండ్  పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు. రాజకీయాల్లో ఉండేందుకు జగన్ కు అర్హత లేదన్నారు. తానుప్రజల భవిష్యత్ కోసం బతుకుతున్నానని అన్నారు.  భారత దేశ గొపప సంపద యువత అని అన్నారు. 2047 వరకు ఒక విజన్ సిద్ధం చేసుకోవాలని ఇటీవల జీ 20 చర్చల సందర్భంగా ప్రధానికి సూచించినట్టు చంద్రబాబు చెప్పారు.

ఏపీలో రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలు, సభలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్1 పై గత కొన్ని రోజులుగా దుమారం కొనసాగుతోంది. ఇటీవలే  జీవో 1 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

అయితే చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూసి తట్టుకోలేక వైసీపీ ప్రభుత్వం జీవోను తీసుకొచ్చిందని మండిపడుతున్నారు. అందుకే పనికిరాని ఈ జీవోను భోగి మంటల్లో వేసి తగులబెడుతున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.