
చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణను రేపటికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు హరీష్ సాల్వే సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. రేపు ( అక్టోబర్ 10) సీఐడీ తరపున ముఖుల్ రోహిత్గి వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే హైకోర్టు,విజయవాడ ఏసీబీ కోర్టులు చంద్రబాబు పిటిషన్లను కొట్టివేశాయి. అక్టోబర్ 10వ తేదీ మంగళవారం సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
ALSO READ : వీళ్లు డబ్బులు పెట్టారా : స్విగ్గీ 99 రూపాయల మెంబర్ షిఫ్ అంట
క్వాష్ పిటీషన్ పై వాదనలు జరుగుతున్న సమయంలో.. సుప్రీంకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఇక్కడ అవినీతి జరిగిందా లేదా అనే విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. అవినీటి రహిత సమాజం కోసమే కదా చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నది అని వ్యాఖ్యలు చేయటం విశేషం. క్వాష్ పిటీషన్ కొట్టివేయాలన్న చంద్రబాబు తరపు లాయర్ల వాదనను.. సీఐడీ తరపు లాయర్లు తప్పుబట్టారు.
ప్రభుత్వ సొమ్ముకు ట్రస్టీగా ఉండాల్సిన వ్యక్తి.. దాన్ని దుర్వినియోగం చేస్తుంటే.. ఆయన్ను తప్పుపట్టకుండా ఇంకెవరిని తప్పుపట్టాలని ప్రశ్నించారు. 13 సంతకాలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. చంద్రబాబుకు తెలియదు అని చెప్పటం సబబు కాదన్నారు. వ్యవస్థలను సక్రమంగా నడిపించాల్సిన వ్యక్తి.. ఆ వ్యవస్థల్లోనే అవినీతికి అవకాశం కల్పించటం కూడా తీవ్ర నేరంగా పరిగణించాలంటూ కోర్టు దృష్టికి తెచ్చారు.
రెండు వర్గాలు వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కేసు విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నది.